Sunday 15 January 2017

India's Greatest Rastrapati......!!!!

*_►►మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి గురించి.._*
_*►►మీడియాకి తెలియని..తెలిసినా చూపని...కొన్ని నగ్న సత్యాలు..!!*_
_*****************************************************************************_.
_*మనం మన జీవితంలో ఇంకో కలాంను చూడలేము ... పి ఎం నాయర్*_
_*కలాంగారి సెక్రెటరీగా పనిచేసిన పి ఎం నాయర్ గారిని దూరదర్శన్ వారు*_
_*చేసిన ఇంటర్వ్యూ లో కొన్ని బాగాలు యొక్క తెలుగు అనువాదం మీ కోసం.*_
.
_*1 . కలాం గారు భారత రాష్ట్రపతిగా వివిధ దేశాలు పర్యటించినపుడు*_
_*ఆయనకు ఆయా దేశాల వారు ఇచ్చిన బహుమతులను తిరస్కరిస్తే*_
_*అది వారి దేశాన్ని*_ _*అవమానించినట్టు వారు బాధపడతారు అని అది*_
_*మన దేశాన్ని ఇరకాటం లో పెడుతుంది అని వాటిని తీసుకునే వారు.*_
_*ఇండియా తిరిగి రాగానే వాటికి ఫోటో తీయించి వాటికి కేటలాగు తయారు*_
_*చేయించి అన్నీ ఆర్కైవ్స్ లో భధ్రపరిచేవారు . ఆయన రాష్ట్రపతి భవన్ విడిచి*_
_*వెళ్ళేటపుడు ఒక్క పెన్సిల్ కూడా వాటిలోనుండి తనతో తీసుకు వెళ్ళలేదు*_
.
_*2. 2002 లో రంజాన్ జూలై ఆగస్ట్ నెలలో వచ్చింది.*_
*_మనదేశం లో రాష్ట్రపతి ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆచారం._*
_*ఒకరోజు కలాంగారు నన్ను పిలిచి ఇఫ్తార్ విందుకు ఎంత ఖర్చు*_
_*అవుతుంది అని అడిగారు.దాదాపు 22 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పాను.*_
_*“ బాగా స్తోమత ఉన్నవారికి విందు ఇవ్వ్వడం కోసం అంత ఖర్చు పెట్టడం అనవసరం.*_
*_ఆ సొమ్మును పేదవారికి_* *_బ్లాంకెట్లు,బట్టలు,ఆహారం ఇవ్వడం కోసం_*
*_కేటాయించండి అని అనాదాశ్రమాలకు ఇవ్వమని చెప్పారు._*
*_అనాదాశ్రమాల పేర్లు ఎంపిక చేసే పని కొందరికి అప్పచెప్పారు_.*
*_అందులో ఆయన ఎటువంటి జోక్యమూ చేసుకోలేదు._*

_*ఎంపిక అయ్యాక నన్నుతన రూమ్ లోకి పిలిచి*_
“ _*ఈ లక్ష రూపాయలూ నా వ్యక్తిగత సంపాదన,*_
*_నేను ఇచ్చే ఈ సొమ్ము విషయం ఎవరికీ చెప్పకండి“అన్నారు.*_
*_నేను ఈ విషయం అందరికీ చెబుతాను అంటే ఆయన వద్దు అన్నారు._*
_*తను ఖర్చు పెట్టదగిన సొమ్ము తన సొమ్మూ కూడా ఇలా ఖర్చు పెట్టిన వ్యక్తి ఇంకొకరులేరు.*_
_*ఇఫ్తార్ పార్టీ ఇవ్వని నిఖార్సయిన ముస్లిం రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం*_
.
_*3. కలాం గారికి తన మాటలకు అందరూ “ ఎస్ సర్ “ అనాలి అనే నైజం లేదు.*_
*_ఒక రోజు సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో_*
_*చర్చల సందర్భంగా ఏమంటావు నాయర్ అని నన్ను అడిగారు*._
*_“ నో సర్ ! “ అన్నాను. కలాంగారు మౌనంగా ఉండిపోయారు._*
_*మీటింగ్ అయ్యాక ప్రధాన న్యాయమూర్తిగారు నన్ను పిలిచి అలా No అన్నారేమిటండి అన్నారు.*_
_*ఆయన తరువాత నన్ను నా అభిప్రాయం చెప్పమని అడుగుతారు సర్..!!*_
*_విని అవసరం అయితే అయన తన అభిప్రాయం మార్చుకుంటారు సర్“_*
_*అని నేను అన్నాను ప్రధాన న్యాయమూర్తి ఇది విని ఆశ్చర్య పోయారు .*_
.
_*4. కలాం గారు ఒక సారి తన బంధువులను సుమారు*_
_*50 మందిని రాష్ట్రపతి భవన్ కు అతిధులుగా పిలిచారు.*_
_*వారికి ఢిల్లీ చూపడానికి ఒక బస్సును ఆయన బుక్ చేయించారు.*_
_*దానికి అయిన ఖర్చును ఆయన చెల్లించారు.*_
_*ఒక్క అధికారిక వాహనం కూడా ఆయన వారికి కేటాయించలేదు.*_
_*వారికోసం అయిన ఖర్చును లెక్క కట్టించారు.*_
_*అది సుమారు రెండు లక్షలు అయ్యింది . ఆ రెండు లక్షలూ ఆయన చెల్లించారు.*_
_*ఈ దేశ చరిత్రలో ఇటువంటి సంఘటన ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు.*_
_*ఆయన అన్నయ్యను ఒక వారం రోజులు తనతో పాటే అట్టే పెట్టుకున్నారు.*_
_*ఆ రోజులకి ఆయన అద్దె చేల్లిస్తాను అంటే మాత్రం ఎవరూ ఒప్పుకోలేదు.*_
_*ఒక రాష్ట్రపతి తన అన్నయ్యను తనతో పాటు అట్టేపెట్టుకున్నందుకు తన నివాసానికి*_
_*తానే అద్దె చెల్లించాలి అనే నిజాయతీని మేము భరించలేము అని మేము ఒప్పుకోలేదు*_
.
_*5. ఆయన రాష్ట్రపతి భవన్ వదిలి వెళ్ళేముందు*_
_*అందరమూ ఒక్కొక్కరుగా*_ _*కుటుంబాలతో వెళ్ళి కలిశాము.*_
_*అందరినీ పేరు పేరునా పలకరించారు.*_
_*నా భార్య కాలు విరిగినందువలన నాతో రాలేకపోయింది.*_
_*ఆయన అడిగారు నా భార్య ఎందుకు రాలేదు అని..??*_

_*నేను కారణం చెప్పాను*._

_*మర్నాడు మా ఇంటి ముందు పోలీస్ లు.*_
_*ఏమిటి హడావుడి అని అడిగితే రాష్ట్రపతి గారు మా ఇంటికి వస్తున్నారు అని చెప్పారు*_

_*ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశాధినేత తన వద్ద పనిచేసే ఒక ఉద్యోగి భార్య కాలు విరిగింది అని తెలిసి అతడి ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించినట్టు చరిత్రలో ఎక్కడా జరగలేదు.*_
.
_*చివరిగా ఒక టి వి వారు చెప్పిన ఆయన ఆస్తి వివరాలు :*_
.
_*1) 3 పాంట్లు*_
_*2) 6 షర్టులు*_
_*3) 3 సూట్లు*_
_*4) 1 వాచ్*_
_*5) 2500 పుస్తకాలు*_
_*6) Scientists Community*_ _*Bangalore వారు ఆయనకు ఎప్పుడో ఇచ్చిన ఒక ఇల్లు*_
*_7) ఇంచుమించు సున్నా బ్యాంకు బాలన్స్_*
*_8) 120 మంది కోట్ల భారతీయుల ప్రేమాభిమానాలు._*
.
*_ఈ విషయాలు తెలియని వారికి అందరికీ తెలియచెప్పడం కోసం..!!_*
*_మీరు షేర్ చేసిన సరే , కాపీ పేస్టూ చేసుకున్నా సరే !!_*
_*నా పేరుతో ఉండడం కన్నా ఒక గొప్ప మహానుభావుడిని*_
*_మనం కళ్ళతో చూశాము అనీ ఆయన నివసించిన కాలంలో_*
*_మనమూ నివసించామనీ అందరికీ తెలియచేయ్యడం ప్రధానం...._*

No comments:

Post a Comment