Friday 13 January 2017

Single Moments Life....

జీవితం లో ప్రతీదీ మళ్ళీ మళ్ళీ వస్తుంది కావచ్చు, కానీ పుట్టుక , పెళ్లి మరియు చావు అనేవి నిజ జీవితం లో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే వస్తాయి....కావున దయచేసి నేను చెప్పే ఈ మూడు విషయాల లో ఎప్పుడూ తొందర పడి నిర్ణయం తీసుకోకండి....

1.పుట్టడం : మన దురదృష్టం,పుట్టుకని మనం కోరుకోలేం..
నరకం ఉందో లేదో కానీ ఈ సృష్టిలో కన్నీటి ని దాటకుండా జీవితం గెలిచిన వారు ఎవరూ లేరు.
కానీ జీవితాన్ని తృప్తిగా అనుభవించవచ్చు అని చెప్పేలా బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అలా బ్రతకడం కేవలం వారి మనసుకు మాత్రమే సాధ్యం కావచ్చు.
వారు అనేదాంట్లో మీరు ఉండాలో వద్దో మీరే తేల్చుకోండి.

2.జీవితం : జీవితం లో అన్నీ కష్టాలే,ఏది మనం అనుకున్నట్టు జరుగుతుందో లేదో తెలీదు.ఏవీ జరగపోయిన అంత ఒరిగిపోయేది ఏం ఉండదు.
పెళ్లి మాత్రం ఇష్టమైన అమ్మాయి/అబ్బాయిని చేసుకోండి,కనీసం ప్రయత్నించండి.
కానీ కుటుంబం అంతా ఒప్పించి,ఎందుకంటే అంతవరకు మనకు ఏ కష్టం వచ్చినా మన తో ఉండేది కేవలం ఒక మన కుటుంబం మాత్రమే.వాళ్ళు పెళ్లి నిరకరించేది మీ భవిష్యత్ పడవుతుందనే భయం తో మాత్రమే కానీ మీపై కోపం తో కాదు....

3.చావు : మనం ఒక్కసారి చస్తే మళ్ళీ మనకు జన్మ ఉందో లేదో ఎవరు కచ్చితాంగా చెప్పలేరు.
ఒకవేళ మళ్ళీ పుట్టిన ఇంతలా ప్రేమించే కుటుంబం,స్నేహితులు,,
ఇంతలా ద్వేషించే శత్రువులు మళ్ళీ మనకు దొరుకుతారో లేదో తెలీదు. కావున చావు వచ్చినప్పుడే చావాలి కానీ ముందుగా మనకు మనం చావకూడదు.
నిన్ను ఎంతలా ప్రేమించే లేదా ద్వేషించే వాళ్ళైనా నువ్వు మరణించే వరకు మాత్రమే ,తర్వాత ఒక రోజు లేదా వారం లేదా నెల లేదా ఒక సంవత్సరం లేదా 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కో ఎవరూ నిన్ను గుర్తు కూడా పెట్టుకోరు.
ఈ సృష్టిలో అందరి కంటే అదృష్టమైన వారు ఎవరో తెలుసా తాను చస్తానని కనీసం ఒక సెకను ముందు అయిన తెలియకుండా అకస్మాత్తుగా చస్తారు చూడు వాళ్ళు.

బ్రతికి నన్ని రోజులు ఎందుకు బ్రతికాడ్రా అని ఎవరూ అనుకోకుండా ఏం బ్రతికాడ్రా...అని అనిపించుకునేల బ్రతికితే చాలు.

మనకు ఏదైనా కష్టం వస్తే చావాలి అని కాకుండా దాన్ని ఎలా గెలవాలి అని ఆలోచించండి.మన మనసుకి ,మెదడుకు పని చెప్పండి.తప్పక గెలుస్తారు.
ఈ సృష్టిలో సమాధానం లేని ప్రశ్న ఏది లేదు,కాకపోతే దానికి సమాధానం మనకు తెలియదు కావచ్చు అంతే●
Youtube Video

No comments:

Post a Comment